Home న్యూస్ 16 వ రోజు కలెక్షన్స్… డే15 కన్నా ఎక్కువే!

16 వ రోజు కలెక్షన్స్… డే15 కన్నా ఎక్కువే!

1

సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 15 రోజుల్లో 95.37 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో 71.05 కోట్ల షేర్ ని క్రాస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 16 వ రోజులో అడుగు పెట్టింది. కాగా సినిమా కి టికెట్ రేట్లు మామూలు రేట్లకి వచ్చేయడంతో మొదటి రెండు వారాల్లో చూడని వారికి చూసే అవకాశం దక్కింది అని చెప్పొచ్చు.

కాగా సినిమా 15 వ రోజు తో పోల్చితే ఈక్వల్ లెవల్ లో 16 వ రోజు ఓపెన్ అయినా ఈవినింగ్ అండ్ నైట్ షోల లో ఓ 5% గ్రోత్ ని ఓవరాల్ గా సాధించింది. 15 వ రోజు 21 లక్షల షేర్ ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 16 వ రోజు ఈ గ్రోత్ తో 25 లక్షల రేంజ్ లో…

కలెక్షన్స్ ని 16 వ రోజు సాధించే అవకాశం ఉంది. నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పెరిగితే ఏ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద కొంచం గ్రోత్ చూపిన ఈ సినిమా శని ఆది వారాల్లో మరింతగా గ్రోత్ ని చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

ఇక రామ్ నటించిన హెలొ గురు ప్రేమ కోసమే 7 రోజుల్లో 17.6 కోట్ల షేర్ ని అందుకోగా 8 వ రోజు టోటల్ గా 60 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా 18.1 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా 9 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక విశాల్ నటించిన పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు కేవలం 15 లక్షల లోపు షేర్ ని అందుకోగా ఇప్పుడు 9 వ రోజు 10 లక్షల లోపు షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు, ఇక ఈ వారం రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఏవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here