ఇది వరకు టాలీవుడ్ లో సినిమాల హిట్స్ ని ఎన్ని సెంటర్స్ లో ఆడాయి లాంటి వివరాలతో ఏ రేంజ్ హిట్ అనేది చెప్పే వాళ్ళు, కానీ కాలం మారుతున్న కొద్ది సినిమాల బాక్స్ ఆఫీస్ రన్ కూడా తగ్గుకుంటూ రాగా, ఒకప్పటికీలా ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు తగ్గిపోతూ వచ్చి కేవలం కొన్ని వారాలకే పరమితం కావాల్సి వస్తుంది. తెలుగు సినిమా హిస్టరీలో చాలా సినిమాలు 100 రోజుల వేడుకను 175 రోజుల వేడుకని కొన్ని సినిమాలు ఏకంగా 365 రోజుల వేడుకను జరుపుకున్నాయి.
వీటిలో 175 రోజుల సిల్వర్ జూబ్లీ వేడుక మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. అప్పట్లో ఒక స్టార్ క్రేజ్ ను ఇన్ని సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పేవారు. మరి అలాంటి ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సిల్వర్ జూబ్లీ సినిమాలలో….
ఎక్కువ సెంటర్లలో జరుపుకున్న సినిమాల విషయానికి వస్తే కొన్ని సినిమాలు డైరెక్ట్ గానే కొన్ని థియేటర్స్ లో ఈ రికార్డులను నమోదు చేశాయి, కొన్ని సినిమాల ఇతర థియేటర్స్ లో షిఫ్ట్ ల పద్దతి లో కూడా ఈ రికార్డ్ ను అందుకున్నాయి కానీ ఇక్కడ కేవలం డైరెక్ట్ సెంటర్ లను మాత్రమే కౌంట్ లోకి తీసుకున్నాం…
- ఎన్టీఆర్ “సింహాద్రి”(2003)———-52 సెంటర్లు
- మహేష్ బాబు “పోకిరి”(2006)——–48 సెంటర్లు
- చిరంజీవి “ఇంద్ర”(2002)————-31 సెంటర్లు
- బాలకృష్ణ “సమరసింహారెడ్డి”(1999)——–29 సెంటర్లు
- శ్రీకాంత్ “పెళ్ళిసందడి”(1996)———–27 సెంటర్లు
- తరుణ్ “నువ్వేకావాలి”(2000)———-25 సెంటర్లు
- అక్కినేని నాగేశ్వరరావు “ప్రేమాభిషేకం”(1981)—-19 సెంటర్లు
- బాలకృష్ణ “నరసింహానాయుడు”(2001)——17 సెంటర్లు
- వెంకటేష్ “కలిసుందాం..రా”(2000)———–14 సెంటర్లు
- సీనియర్ ఎన్టీఆర్ “లవకుశ”(1963)———13 సెంటర్లు
ఇవీ మొత్తం మీద ఇప్పటి వరకు రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్ హైయెస్ట్ సెంటర్స్ లో 175 రోజులు ఆడిన సినిమాలు.
ఇవి టాలీవుడ్ హిస్టరీలో టాప్ 10 స్థానాల్లో నిలిచిన సినిమాలు, ఒకప్పటిలా ఇప్పుడు వచ్చిన రాబోతున్న ఏ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇన్నేసి రోజులు ఆడటం అన్నది ఆసాధ్యం అనే చెప్పాలి. దాంతో ఫ్యూచర్ లో కూడా ఈ రికార్డులు ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.