బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మాస్ రాంపెజ్ ను చూపెడుతూ రికార్డులను చెల్లాచెదురు చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న తర్వాత…
ఆ బిజినెస్ మొత్తాన్ని కూడా రికవరీ చేసి మమ్మోత్ రికార్డ్ ను నమోదు చేయడమే కాదు తర్వాత కూడా క్రమం తప్పకుండా లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతున్న సినిమా మొత్తం మీద లాంగ్ రన్ లో ఇప్పుడు టాలీవుడ్ మూవీస్ పరంగా చూసుకుంటే…
ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాల పరంగా ఒకటిగా దూసుకు పోతూ మాస్ భీభత్సం సృష్టిస్తుంది… కాగా సినిమా 26 రోజులు పూర్తి అయ్యే టైంకి ఆల్ మోస్ట్ 800 కోట్ల లోపు షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది….
కాగా సినిమా బిజినెస్ 617 కోట్ల మీద ఏకంగా 182 కోట్లకు పైగా షేర్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని రికార్డ్ తో దూసుకు పోతుంది…617 కోట్ల బిజినెస్ మీద 182 కోట్ల రేంజ్ ప్రాఫిట్ అంటే చరిత్రలో నిలిచి పోయే విషయమే అని చెప్పాలి. అదే టైంలో…
టాలీవుడ్ తరుపున ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న మూవీస్ పరంగా మరో 4 కోట్ల లాభాన్ని పుష్ప2 సొంతం చేసుకుంటే ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ని అందుకున్న మూవీస్ లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ కి చేరుకుంటుంది…
2015 టైంలో వచ్చిన బాహుబలి సినిమా 118 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో 186 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని టాప్ 2 ప్లేస్ లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి2 మూవీ 352 కోట్ల బిజినెస్ 508 కోట్ల ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…ఇక లాంగ్ రన్ లో పుష్ప2 మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.