పాజిటివ్ టాక్ కి ఉన్న పవర్ అంటే ఇదే అని చెప్పాలి, బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు ఆడియన్స్ ఏ సినిమా నైనా ఇష్టపడితే ఆ సినిమా మనదా లేక డబ్బింగ్ వర్శనా అని చూడకుండా సినిమా చూడటానికి ఎగబడతారు, రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఏమి లేకుండానే రిలీజ్ అయిన డబ్బింగ్ మూవీ వరుణ్ డాక్టర్ తెలుగు లో రిలీజ్ అయినప్పుడు 184 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా…
వీకెండ్ తిరిగే లోపే థియేటర్స్ ని పెంచుకుంటూ 220 వరకు వెళ్ళగా తర్వాత వారం కొత్త సినిమాల కోసం థియేటర్స్ కొన్ని తగ్గినా మళ్ళీ థియేటర్స్ ని పెంచుకుంటూ వెళుతున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 300 థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది….
ఇది నిజంగానే మాస్ గ్రోత్ అని చెప్పాలి… పోటి లో సినిమాలు ఉన్నా జనాల ఆసక్తి ఈ సినిమా పై ఉండటం, అసలు పెద్దగా ప్రమోషన్స్ లాంటివి లేకున్నా 2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడానికి సినిమా సిద్ధం అవుతూ ఉండటం, ఈ వారం కూడా సినిమా హోల్డ్ చేసేలా ఉండటం లాంటివి సినిమా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.