బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టాక్ దృశ్యా చూసుకుంటే లాంగ్ రన్ లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఇంకా అందుకోవాల్సిన టార్గెట్ అయితే మాత్రం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇక 18వ రోజు ఆదివారం అవ్వడంతో సినిమా ఉన్నంతలో మంచి హోల్డ్ నే చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది.
సినిమా 17వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 35% రేంజ్ లో గ్రోత్ ని చూపించగా ఈ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 35 లక్షల నుండి 40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే సినిమా మొత్తం మీద…
45 లక్షల దాకా వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉందని చెప్పాలి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 50 లక్షల నుండి 55 లక్షల మధ్యలో షేర్ ని అందుకోవచ్చు. మొత్తం మీద 18వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ నే చూపిస్తుంది. ఇక అఫీషియల్ 18 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.