బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మూడో వీకెండ్ ని పూర్తి చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ దేవర(Devara Part 1) ఊహకందని రేంజ్ లో ఊచకోత కోస్తూ మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా రిమార్కబుల్ హోల్డ్ తో లాంగ్ రన్ ను దక్కించుకుంటూ ఉండగా…
సినిమా 18వ రోజు ఫుల్ వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా కోస్టల్ ఆంధ్ర రీజన్ లో కొన్ని చోట్ల పార్షిక హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో మరోసారి జోరు చూపెడుతూ మంచి ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంటూ ఉండగా కొన్ని చోట్ల వర్షాల వలన ఎఫెక్ట్ ఉన్నా కూడా…
ఓవరాల్ గా 18వ రోజు ఉన్నంతలో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా రెండో శుక్రవారం బుకింగ్స్ తో పోల్చితే 20% రేంజ్ లోనే డ్రాప్స్ కనిపిస్తూ ఉండటం తో మరోసారి మంచి కలెక్షన్స్ ని 18వ రోజున సొంతం చేసుకునే అవకాశం ఉంది.
మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆంధ్రలో సీడెడ్ లో మాస్ సెంటర్స్ లో డీసెంట్ ఆక్యుపెన్సీ ఉండగా ఆంధ్రలో నంద్యాల, శ్రీకాకుళం మరియు మరికొన్ని చిన్న చిన్న స్టేషన్ లలో సైతం హౌస్ ఫుల్ బోర్డులు పడటం దేవర ఊరమాస్ లాంగ్ రన్ కి నిదర్శనం అని చెప్పాలి…
రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను అందుకున్న మూవీస్ లో ఒకటిగా దూసుకు పోతున్న దేవర యావరేజ్ రివ్యూలతోనే ఈ రేంజ్ లో మాస్ హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం. ఇక 18వ రోజు ఓవరాల్ గా సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.