Home న్యూస్ 18.5 కోట్ల బిజినెస్….19 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది ఇది!!

18.5 కోట్ల బిజినెస్….19 కోట్ల టార్గెట్…7 రోజుల్లో వచ్చింది ఇది!!

0

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ ని పూర్తీ చేసుకుంది, సినిమా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయినా కానీ ఓవరాల్ గా బిజినెస్ ను రికవరీ చేసి ప్రాఫిట్ జోన్ లో ఎంటర్ అవ్వడం తో మొత్తం మీద ఇక మీదట వచ్చేవి అన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు….

మరో వర్కింగ్ డే అవ్వడంతో మరోసారి డ్రాప్స్ గట్టిగానే సొంతం చేసుకున్నా కానీ మొత్తం మీద రోజును పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో ముగించింది. సినిమా 30-35 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ మొత్తం మీద 7వ రోజున సినిమా…

36 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 35 కోట్ల మార్క్ ని అధిగమించి లాంగ్ రన్ లో 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకునేలా దూసుకు పోతుండగా మొత్తం మీద మొదటి వారానికి గాను సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 7.00Cr
👉Ceeded: 3.71Cr
👉UA: 2.16Cr
👉East: 1.10Cr
👉West: 89L
👉Guntur: 1.26Cr
👉Krishna: 98L
👉Nellore: 75L
AP-TG Total:- 17.85CR(29.40CR Gross)
Ka+ROI: 1.35Cr(Updated)
OS – 2.25Cr
Total WW: 21.45CR(35.70CR~ Gross)
ఇదీ సినిమా మొదటి వారం లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. వర్కింగ్ డేస్ లో స్లో అయినా…

టోటల్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాల్లో ఉంది సినిమా. 18.5 కోట్ల బిజినెస్ కి 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ వీక్ తర్వాత ఇప్పుడు 2.45 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తూ రెండో వారంలో అడుగు పెట్టింది, మరి రెండో వారంలో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here