మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ లో ది బెస్ట్ అనిపించే కలెక్షన్స్ తో దూసుకు పోతున్న విరూపాక్ష సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో హోల్డ్ చేసి దుమ్ము లేపుతుందో ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఇదే రేంజ్ లో రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమా ఓవర్సీస్ లో ఇప్పుడు 6 రోజులు పూర్తీ అయ్యే టైంకి అల్టిమేట్ కలెక్షన్స్ తో 1.50 కోట్ల బిజినెస్ మీద 4.20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఊహకందని ప్రాఫిట్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా ఇందులో ఒక్క అమెరికాలో నే ఇప్పుడు…
సినిమా మ్యాజికల్ 1 మిలియన్ మార్క్ ను అందుకుని సంచలనం సృష్టించింది. సాయి ధరం తేజ్ కెరీర్ లోనే ఇది మొట్ట మొదటి 1 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా అవ్వడం ఇప్పుడు విశేషం అని చెప్పాలి…. ఇది వరకు ప్రతీ రోజూ పండగే సినిమా హాల్ఫ్ మిలియన్ కి పైగా…
గ్రాస్ ను అందుకుంటే ఆ మార్క్ ని ఇప్పుడు ఆల్ మోస్ట్ డబుల్ మార్జిన్ తో అందుకోబోతున్న విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఉండటంతో రెండో వీకెండ్ లో మరింతగా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.