స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల లేటెస్ట్ మూవీ “అల వైకుంఠ పురంలో” బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ తో రన్ అవుతుండగా సినిమా మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ ట్రేడ్ అంచనాలను కూడా మించేసే ఓపెనింగ్స్ తో అన్ని సెంటర్స్ లో అల్టిమేట్ ఆక్యుపెన్సీ తో రన్ అవుతుంది.
ఓవరాల్ గా సినిమా మొదటి రోజు థియేటర్స్ కౌంట్ ని ముందుగా గమనిస్తే
?Nizam: 205+
?Ceeded: 160+
?AP: 350+
AP-TG: 715+
?KA & ROI: 220+
?OS: 210+
WW: 1150+ ఇది అల్లు అర్జున్ ఇతర సినిమాలతో పోల్చితే తక్కువ కౌంట్ అనే చెప్పాలి. దాంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అన్న టెన్షన్ ట్రేడ్ లో అందరిలో ఉండేది.
కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదటి రోజు కి గాను రిలీజ్ రోజు మొదటి షో సమయానికి 95% కి మించి అయిపోయాయి. ఎక్స్ ట్రా షోలు యాడ్ చేద్దామని నిర్మాతలు ట్రై చేస్తున్నా పోటి లో ఉన్న సరిలేరు నీకెవ్వరు కూడా దుమ్ము లేపుతుండటంతో లిమిటెడ్ రిలీజ్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు “అల వైకుంఠ పురంలో” అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ని తిరగరాసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మినిమం లెక్క 18 కోట్ల నుండి మొదలు అవుతుందని చెప్పొచ్చు. అది ఎంతవరకు వెళుతుంది అన్నది ఓవరాల్ గా రోజు మొత్తం ముగిసే సరికి చెప్పగలం.
ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ని ఆల్ మోస్ట్ టచ్ చేసిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు లిమిటెడ్ థియేటర్స్ లోనే సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయడం కన్ఫాం అని చెప్పాలి. ఇక సంక్రాంతి హాలిడేస్ లో మరింత జోరు చూపే అవకాశం ఉంది, ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.