Home న్యూస్ దర్బార్ డే 1 ఓపెనింగ్స్…సూపర్ స్టార్ మాస్!!

దర్బార్ డే 1 ఓపెనింగ్స్…సూపర్ స్టార్ మాస్!!

0

     సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 750కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోగా ప్రీమియర్ షోలకు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని రెగ్యులర్ షోలకు కూడా అదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ పరంగా కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు జరిగిన బుకింగ్స్ మొత్తం మీద 35% వరకు ఉండగా రిలీజ్ రోజు మొత్తం మీద 40% వరకు బుకింగ్స్ ని మొదటి రెండు షోలకు సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ సాలిడ్ గా సాగుతున్నాయి.

దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పేట కన్నా చాలా బెటర్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తె 2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పొచ్చు.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ బాగుంది కాబట్టి బుకింగ్స్ బాగుండి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటె లెక్క 3.5 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది, మాస్ సెంటర్స్ హోల్డ్ ని బట్టి అంతకు మించి ముందుకు వెళుతుందా లేదా అన్నది చెప్పగలం.

ఇక తమిళ్ లో సినిమా 18 కోట్ల కి పైగా గ్రాస్ ని మొదటి రోజు అందుకోవచ్చట. ఇతర చోట్ల కూడా ఓపెనింగ్స్ బాగుండగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 280 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూసి అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here