Home న్యూస్ దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్స్….సూపర్ స్టార్ ఊచకోత!!

దర్బార్ ఫస్ట్ డే కలెక్షన్స్….సూపర్ స్టార్ ఊచకోత!!

0

     సూపర్ స్టార్ రజినీకాంత్ మురగదాస్ ల లేటెస్ట్ మూవీ దర్బార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకునే దిశగా దూసుకు పోతుంది, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా మొదలు అవ్వగా మార్నింగ్ షోల సమయానికి సినిమా పుంజుకోవడం మొదలు పెట్టింది, తర్వాత జోరు తగ్గకుండా చూసుకుంటూ గ్రోత్ ని సాధిస్తూ మంచి ఓపెనింగ్స్ దిశగా అడుగులు వేస్తుంది దర్బార్ సినిమా.

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి మంచి గ్రోత్ ని సాధించగా ఇప్పుడు లెక్క 3 కోట్ల నుండి మొదలు అవుతుంది అని చెప్పాలి. సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి పూర్తీ ఆఫ్ లైన్ లెక్కలు అనుకున్న విధంగా ఉంటె…

బాక్స్ ఆఫీస్ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3.6 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇది రీసెంట్ టైం లో 2.0 తప్పితే బెస్ట్ ఓపెనింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు రజినీ కెరీర్ లో. ఇక టాక్ కూడా ఎంకరేజింగ్ గానే ఉండటం తో సినిమా మొదటి 2 రోజుల్లో సాలిడ్ గా…

హోల్డ్ చేస్తుందని అంటున్నారు. మూడో రోజు నుండి తెలుగు బిగ్గీస్ నుండి పోటి ఉన్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా మరింత జోరు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తమిళ్ వర్షన్ వరల్డ్ వైడ్ గా 40 నుండి 45 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకోవచ్చట.

ఓవరాల్ గా అన్ని వర్షన్స్ కలుపుకుని వరల్డ్ వైడ్ గ్రాస్ 50 కోట్ల నుండి 60 కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రజినీ మురగదాస్ ల దర్బార్ మొదటి రోజు అఫీషియల్ గా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here