Home న్యూస్ 11 కోట్ల రేటు…ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ఇవి!!

11 కోట్ల రేటు…ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ ఇవి!!

0

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్… బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమా కి పోటిగా వచ్చిన ఈ సినిమా మంచి థియేటర్స్ కౌంట్ నే సొంతం చేసుకుని రిలీజ్ అయ్యింది. కానీ మౌత్ టాక్ మరీ అనుకున్న రేంజ్ లో లేక పోవడంతో కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేక పోయింది…

అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మొదటి రోజు సినిమా సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ డీటైల్స్ ని మేకర్స్ బయటికి చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. షేర్ వివరాలు ఎక్కడా కూడా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ వర్గాల ప్రకారం తొలిరోజు సినిమా…

రెండు తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల నుండి 85 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం… అందులో నైజాంలో 35 లక్షల రేంజ్ లో షేర్ ని, సీడెడ్ లో 15-18 లక్షల రేంజ్ లో షేర్ ని, ఇక ఆంధ్ర రీజన్ లో 30 లక్షలకు పైగా షేర్ ని సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా….

ఓవరాల్ గా సినిమాను మొదటి రోజు నుండే పెర్సెంటేజ్ బేస్ తో రన్ చేస్తున్నారట. అంటే నెట్ కలెక్షన్స్ లో సగం షేర్ సగం రెంట్స్ కి వెళుతుంది. మొత్తం మీద సినిమా మొదటి రోజు గ్రాస్ పరంగా 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు షేర్ లెక్క 85 లక్షల నుండి….

88 లక్షల దాకా ఉంటుందని అంచనా… సినిమా టోటల్ బిజినెస్ లెక్క 11 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. ఆ లెక్క ప్రకారం సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ బిజినెస్ ను అందుకోవడానికి అయితే సరిపోవు అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు మూడు రోజుల్లో రెట్టించిన జోరు తో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here