Home న్యూస్ రౌడీ బాయ్స్ 2 వీక్స్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇది!!

రౌడీ బాయ్స్ 2 వీక్స్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఇది!!

0

ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ లో అయితే ఇంపాక్ట్ ని చూపలేదు అనే చెప్పాలి. బంగార్రాజు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్ట పడుతూ ఉండగా పండగ టైం లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో సినిమా రౌడీ బాయ్స్ హీరో కి కెరీర్ లో ఫస్ట్ మూవీనే అయినా పండగ టైం లో కావలసినని థియేటర్స్ దొరకడంతో కుమ్మేస్తుంది అని అంతా….

అనుకున్నారు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. పండగ సెలవుల్లో పర్వాలేదు అనిపించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో భారీగా డ్రాప్ అయింది కానీ థియేటర్స్ ని కావలసినన్ని హోల్డ్ చేయడంతో ఆడియన్స్ కి అయితే బంగార్రాజు లేక రౌడీ బాయ్స్…

మాత్రమే ఆప్షన్స్ గా మారగా ఉన్నంతలో రెండో వారంలో పర్వాలేదు అనిపించేలా సినిమా పరుగును కొనసాగించింది కానీ సినిమా బిజినెస్ వాల్యూ ఎక్కువగా ఉండటంతో ఆ మార్క్ ని అందుకోవాలి అంటే ఈ కలెక్షన్స్ అసలు ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి… మొత్తం మీద రౌడీ బాయ్స్ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.68Cr
👉Ceeded: 81L
👉UA: 1.16Cr
👉East: 28L
👉West: 20L
👉Guntur: 23L
👉Krishna: 23L
👉Nellore: 15L
AP-TG Total:- 4.74CR(8.90CR~ Gross)
👉Ka+ROI: 0.10Cr
👉OS – 0.12Cr
Total WW: 4.96CR(9.25CR~ Gross)
ఇదీ 2 వారాల టోటల్ కలెక్షన్స్…

సినిమా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 11 కోట్లు కాగా సినిమా 11.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాల తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే ఇంకా 6.54 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సగం కూడా రికవరీ చేయలేక పోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here