ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో రీమేక్ చేయడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ వచ్చేదే… అన్ని సినిమాలు వర్కౌట్ అవ్వాలని లేదు కానీ చాలా వరకు సినిమాలు ఒరిజినల్ ని మెప్పించి హిట్ అయినవే ఉన్నాయి. టాలీవుడ్ లో అలా ఒరిజినల్ ని మరీ మార్చకుండా ఉన్నది ఉన్నట్లు తీసి హిట్ కొట్టిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం రీమేక్ దృశ్యం కూడా ఒకటి అని చెప్పాలి.
6 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. కానీ ఒరిజినల్ వర్షన్ అయిన దృశ్యం మలయాళ ఇండస్ట్రీ లో అప్పట్లో రికార్డులు సృష్టిస్తూ ఆల్ మోస్ట్ 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేయగా…
ఇక్కడ దృశ్యం మార్కెట్ భారీగా ఉన్నా కానీ 36 కోట్ల రేంజ్ గ్రాస్ కే పరిమితం అయింది, కానీ ఆ టైం లో వెంకటేష్ సోలో హీరోగా ఫ్లాఫ్స్ లో ఉండగా ఈ సినిమా కంబ్యాక్ ఇవ్వడానికి ఉపయోగ పడింది అని చెప్పాలి. కాగా ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ కి సీక్వెల్ ని మొదలు పెట్టె పనిలో ఉన్నారు..
రీసెంట్ గా చిన్న గ్లిమ్స్ ని కూడా రిలీజ్ చేయగా అక్కడ సీక్వెల్ సిద్ధం అవుతుంది, ఇక్కడ పరిస్థితి ఏంటి అని సురేష్ ప్రొడక్షన్ ని అడగ్గా…. అక్కడ సీక్వెల్ హిట్ అయితేనే ఇక్కడ సీక్వెల్ వస్తుందని, అప్పటి వరకు ఓన్ స్క్రిప్ట్ తో తెలుగు సీక్వెల్ ని మొదలు పెట్టె ఆలోచన అయితే లేదని చెప్పారట..
సో మరో ఏడాది, ఏడాదిన్నర వరకు తెలుగు సీక్వెల్ కష్టమే అని చెప్పాలి. ఇక వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ రీమేక్ మూవీ నారప్ప ఆల్ మోస్ట్ ఫైనల్ స్టేజ్ లోనే ఉన్నా కానీ సేఫ్టీ కోసం వచ్చే ఇయర్ కి పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా అయిన తర్వాత దృశ్యం2 ఎదో ఒక అప్ డేట్ ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు…