మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా సాయి ధరం తేజ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ మూవీగా నిలిచి సెన్సేషనల్ కలెక్షన్స్ సొంతం అయ్యేలా చేసిన విషయం తెలిసిందే. రిలీజ్ కి ముందు రోజు వరకు పెద్దగా బజ్ లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ హెల్ప్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
అలాంటి ఈ సినిమాలో విలన్ గా నటించిన హీరోయిన్ సంయుక్త తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకోగా క్లైమాక్స్ లో సాయి ధరం తేజ్ మరియు సంయుక్త ఇద్దరూ పోటి పడీ నడించారు. కానీ ఈ సినిమాకి ముందుగా విలన్ గా అనుకున్నది మాత్రం సంయుక్తని కాదట…
ఈ సినిమాలో హీరోకి అక్కగా నటించిన శ్యామల రోల్ ని ముందు విలన్ గా అనుకున్నారట, అందుకే ఆమెకి చెవిపోటు లాంటివి పెట్టినా ఎందుకో డైరెక్టర్ సుకుమార్ ఆ రోల్ అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండే అవకాశం తక్కువ కాబట్టి హీరోయిన్ అయితే బాగుంటుంది అని డైరెక్టర్ కి చెప్పాడట.
తర్వాత డైరెక్టర్ ఆ ఆలోచన నచ్చి కథని ఆ విధంగా మార్చుకున్నాడు. ఇది నిజంగానే బాగా వర్కౌట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. సాయి ధరం తేజ్ కి తిరుగు లేని బాక్స్ ఆఫీస్ కంబ్యాక మూవీగా నిలిచి తన ఫ్యూచర్ సినిమాల మీద కూడా అంచనాలను ఇంకా పెరిగేలా చేసిందని చెప్పాలి.