బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ భారీ లెవల్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా మీద ఆడియన్స్ లో భారీగా అంచనాలు ఉన్నా కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమే జరగగా మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన సినిమా కి ఆడియన్స్ నుండి ఏమాత్రం అనుకూలంగా టాక్ అయితే రాలేదు అని చెప్పాలి ఇప్పుడు.
కానీ సినిమా కి మాస్ సెంటర్స్ లో మొత్తం మీద మంచి ఆక్యుపెన్సీనే లభించింది అని చెప్పాలి. క్లాస్ సెంటర్స్ లో కొన్ని చోట్ల పొన్నియన్ సెల్వన్ 2 మరియు విరూపాక్ష సినిమాల ఇంపాక్ట్ పడగా టాక్ కూడా ఓవరాల్ గా దెబ్బ తీసింది..
దాంతో సినిమా మొత్తం మీద అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను మించి పొతే ఈ కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో సాలిడ్ ట్రెండ్ ని చూపించి ఈ అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు వసూళ్ళని సాధిస్తుందో లేదో చూడాలి. ఫస్ట్ డే అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చాక కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం…