Home న్యూస్ కృష్ణ వ్రింద విహారి ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్!

కృష్ణ వ్రింద విహారి ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్!

0

యంగ్ హీరో నాగాషౌర్య నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ సొంతం అయింది, ఇక సినిమా ఓపెనింగ్స్ మాత్రం నేషనల్ సినిమా డే వలన కొన్ని చోట్ల 112 రేటు ఉన్నప్పటికీ కూడా ఆక్యుపెన్సీ మాత్రం మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదు కానీ సినిమా ఓవర్సీస్ లో మాత్రం…

ఉన్నంతలో మంచి ఓపెనింగ్స్ నే అందుకుంది. ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి టోటల్ ఓవర్సీస్ లో 56 వేల డాలర్స్ దాకా కలెక్షన్స్ ని అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారి రిపోర్ట్స్ ని అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు కానీ….

ట్రేడ్ లెక్కలలో మొదటి రోజు సినిమా అటూ ఇటూగా 70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుందని అంచనా వేస్తున్నారు. ఇక అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఇక సినిమా సాధించిన బిజినెస్ లెక్కలను కూడా రివీల్ చేయలేదు కానీ ఓవరాల్ వర్త్ బిజినెస్ 5.2 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… ఆ లెక్కన సినిమా ఇంకా జోరు చూపించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here