మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Movie) ట్రైలర్ ఆకట్టుకోవడంతో భారీ లెవల్ లోనే రిలీజ్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా వరుణ్ తేజ్ రీసెంట్ మూవీస్ రిజల్ట్ ఇంపాక్ట్ ఈ సినిమా పై పడింది…దానికి తోడూ పోటిలో ఉన్న సూర్య(Suriya) కంగువ(Kanguva Movie)….
మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవడం కూడా మట్కా ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది కానీ మాస్ సెంటర్స్ లో బిలో పార్ అనిపించేలా ట్రెండ్ అవుతున్న సినిమా మొత్తం మీద వరుణ్ తేజ్ లాస్ట్ 3 సినిమాలతో పోల్చితే వాటి రేంజ్ లో కూడా బుకింగ్స్ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు…
ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మునుపటి ఫామ్ ను అందుకునే రేంజ్ లో అయితే ఓపెనింగ్స్ మినిమమ్ కూడా లేవనే చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే మొదటి రోజు ఓవరాల్ గా…
40 లక్షల రేంజ్ నుండి 50 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 60 లక్షల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉంది…కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు సూపర్ స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇక ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ కూడా నిరాశ పరిచే విధంగానే ఉండగా సినిమా ఓవరాల్ గా మొదటి వరల్డ్ వైడ్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 80 లక్షల నుండి 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకోవచ్చు. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపెడుతుందో చూడాలి.