బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ మంచి హిట్ మూవీస్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆడియన్స్ ముందుకు యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన కొత్త సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky 1st Day Collections) సినిమా, రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో…
రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది…దాంతో ఇక మరోసారి విశ్వక్ సేన్ బాక్స్ ఆఫీస్ ను ఈ సినిమాతో షేక్ చేస్తాడు అని అనుకున్నా కూడా మొదటి రోజు ఇప్పటి వరకు సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి అని చెప్పాలి…
విశ్వక్ సేన్ నటించిన రీసెంట్ మూవీస్ బుకింగ్స్ తో పోల్చితే సగం కూడా ట్రెండ్ కనిపించడం లేదు… ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 80-90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. కంప్లీట్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టే కలెక్షన్స్ లో గ్రోత్ ఉండే అవకాశం ఉండగా…
వరల్డ్ వైడ్ గా సినిమా 1.2 కోట్ల రేంజ్ నుండి 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా విశ్వక్ సేన్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా తక్కువగానే ఉన్నాయి బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే…కానీ…
టాక్ కొంచం బెటర్ గానే ఉండటం, మరో 2 వారాల దాకా పెద్దగా సినిమాలు ఏమి లేక పోవడంతో స్టడీ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక మొదటి రోజుకి గాను మెకానిక్ రాకీ మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.
Ok