బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. ఇలాంటి టైం లో పెద్దగా ఏమి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో 380 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే స్టార్ట్ అయినా కానీ బుకింగ్స్ ఏమాత్రం కూడా ఆకట్టుకోలేదు…
దాంతో టోటల్ గా సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి. మంచి స్టొరీ పాయింట్ తో ఎమోషనల్ టచ్ తో లైట్ కామెడీతో మెప్పించిన…
ఈ సినిమా ఓపెనింగ్స్ అంతంత మాత్రమె ఉన్నప్పటికీ తర్వాత పుంజుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ప్రజెంట్ ఓపెనింగ్స్ మాత్రం రీసెంట్ టైం లో శర్వానంద్ కెరీర్ లోనే లోవేస్ట్ అనిపించే రేంజ్ లో ఉండగా అన్ని చోట్లా మొదటి రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే మొత్తం మీద…
మొదటి రోజు తెలుగు రాష్ట్రలలో ఈ సినిమా 80 లక్షల నుండి కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అది కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటేనే. ఒక పక్క బ్రహ్మాస్త్రతో పోటి, మరో పక్క వినాయక నిమజ్జనం కూడా ఉండటం కూడా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ని ఇప్పుడు చూపిస్తున్నాయి అని చెప్పాలి.
ఓవరాల్ గా అన్ని చోట్లా రిపోర్ట్స్ బెటర్ గా ఉంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది, ఓవరాల్ గా స్లో స్టార్ట్ నే సినిమా సొంతం చేసుకుంటూ ఉండగా టాక్ అయితే పాజిటివ్ గానే ఉండటంతో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…