Home న్యూస్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 1st డే టోటల్ కలెక్షన్స్….కుమ్మింది సినిమా!!

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ 1st డే టోటల్ కలెక్షన్స్….కుమ్మింది సినిమా!!

0

ప్రదీప్ రంగనాథన్‌(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్(Return Of The Dragon) తెలుగు లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి సినిమా కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా సినిమా ముందు స్లో బుకింగ్స్ ను సొంతం చేసుకున్నా కూడా…

ఎక్స్ లెంట్ టాక్ హెల్ప్ తో అంచనాలను మించి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు నైట్ షోల టైంకి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించి అనుకున్న అంచనాలను మించి పోయింది…. ఓవరాల్ గా మొదటి రోజు..

1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. తెలుగులో బిజినెస్ లెక్కలు ఇంకా క్లియర్ గా రివీల్ అవ్వలేదు. ఇక వీకెండ్ లో మరింతగా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా ఇక తమిళనాడులో మొదటి రోజున..

అంచనాలను అన్నీ కూడా మించిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది…. అక్కడ మొదటి రోజు 4.5-5 కోట్ల రేంజ్ కి వెళుతుంది అనుకున్నా ఏకంగా 5.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది… ఇక కర్ణాటక మరియు..

రెస్ట్ ఆఫ్ ఇండియా లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 3.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా మొదటి రోజున వరల్డ్ వైడ్ గా సినిమా 11.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని అంచనాలను మించి పోయి…

డబుల్ డిజిట్ గ్రాస్ ఓపెనింగ్స్ తో ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసింది. ఇక సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 28-29 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…సినిమా ఓపెనింగ్స్ రేంజ్ చూస్తుంటే ఈ మార్క్ ని అవలీలగా అందుకునేలా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here