మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) నటించిన లేటెస్ట్ మూవీ విడుదల పార్ట్ 2(Vidudala Part 2) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తమిళ్ లో మంచి టాక్ ను సొంతం చేసుకోగా తెలుగు లో మాత్రం కొంచం మిక్సుడ్ టాక్ ను సినిమా సొంతం చేసుకుంది. ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే సినిమా…
తమిళ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బిలో పార్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో 35 లక్షల గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు ఓవరాల్ గా 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…
మొత్తం మీద మొదటి రోజు షేర్ 22 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా…సినిమా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా వీకెండ్ లో సాలిడ్ జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
ఇక సినిమా తమిళనాడులో మొదటి రోజున ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలిపి మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 13.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…షేర్ ఓవరాల్ గా 5.50 కోట్ల లోపు ఉంటుందని అంచనా…
సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 35 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉందని అంచనా…సినిమా వీకెండ్ లో సాలిడ్ జోరుని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తెలుగు లో కూడా వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.