బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1), సినిమా 6వ రోజు ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసిన తర్వాత 7వ రోజు ఫుల్ వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా అనుకున్న దాని కన్నా కూడా డ్రాప్స్ ను ఎక్కువగానే సాధించింది.
సినిమా మొత్తం మీద 3.2-3.5 కోట్ల రేంజ్ కి వెళుతుంది అమో అనుకున్నా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉండటంతో సినిమా ఎక్కువగానే డ్రాప్ అయ్యి టోటల్ గా 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.81 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టింది.
ఓవరాల్ గా 4.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది కానీ ఇంకా బెటర్ గా హోల్డ్ చేసి ఉండాల్సింది. అయినా కూడా ఓవరాల్ గా ఇప్పుడు దేవర మూవీ మొదటి వారంలో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో…
సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Devara Movie 7 Days AP-TG Total Collections report(Inc GST)
👉Nizam: 49.43Cr
👉Ceeded: 22.62CR
👉UA: 13.28Cr
👉East: 7.92Cr
👉West: 6.41Cr
👉Guntur: 10.69Cr
👉Krishna: 7.05Cr
👉Nellore: 5.05Cr
AP-TG Total:- 122.45CR(172.25CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 112.55 కోట్ల వాల్యూ బిజినెస్ ను అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కోసం 114 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఆ మార్క్ ని దాటేసి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 8.45 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది. ఇక రెండో వీక్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.