కెరీర్ మొదట్లో వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకుని మంచి ప్రామిసింగ్ హీరోగా మారుతున్న టైంలో వరుస పెట్టి ఫ్లాఫ్స్ ఒకటి తర్వాత ఒకటి వచ్చి తన సినిమాలను కూడా పట్టించుకునే పరిస్థితిని తెచ్చుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun)….ఈ ఇయర్ మొదట్లో నా సామి రంగ మూవీ లో…
స్పెషల్ రోల్ తో మెప్పించినా కూడా రాజ్ తరుణ్ కొత్త సినిమాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హెల్ప్ అయితే కలగడం లేదు…లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు(Purushothamudu Movie Collections)మూవీ రిలీజ్ అవ్వగా…
జనాలు రాజ్ తరుణ్ రియల్ లైఫ్ కాంట్రవర్సీల మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టగా ఈ సినిమాను పట్టించుకున్న వాళ్ళే లేరు…మినీ శ్రీమంతుడులా అనిపించినా ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా…
తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చేసరికి సినిమా మొత్తం మీద కొంచం తేరుకుని 15 లక్షల మేర షేర్ ని రాబట్టింది…దాంతో టోటల్ గా మొదటి వారం పూర్తి అయ్యే టైంకి 45-50 లక్షల మధ్యలో షేర్ ని అందుకుంది. అది కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా వచ్చిన కలెక్షన్స్ కాకుండా…
వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 1.1 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా…ఓవరాల్ గా ఓన్ రిలీజ్ అయినా కూడా బడ్జెట్ కొంచం ఎక్కువ అయిన ఈ సినిమా కి 1.50 కోట్లకు పైగా అయినా షేర్ రావాల్సి ఉండగా సినిమా మొత్తం మీద ఆల్ మోస్ట్ రన్ ని ఎండ్ చేసుకుందని చెప్పాలి…
మొత్తం మీద వాల్యూ టార్గెట్ కి కూడా చాలా దూరంలోనే ఆగిపోయిన ఈ సినిమా ఒకప్పుడు హాట్రిక్ హిట్స్ కొట్టి కెరీర్ లో ఎక్స్ లెంట్ స్టార్ట్ అందుకున్న రాజ్ తరుణ్ కి కనీసం కోటి షేర్ కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి కనిపించకపోవడం విచారకం అనే చెప్పాలి.