Home న్యూస్ మంచి సినిమా..అయినా చూడట్లేదు…1st వీక్ లో వచ్చింది ఇది!

మంచి సినిమా..అయినా చూడట్లేదు…1st వీక్ లో వచ్చింది ఇది!

0

అప్పుడప్పుడు మంచి సినిమాలు వచ్చినప్పుడు జనాలు ఆ సినిమాలను ఎంకరేజ్ చేయాలి, అప్పుడే అలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు మంచి సినిమాలు వచ్చినా కూడా ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ఇవ్వరు…

లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఇలాంటిదే జరిగింది…రాజ్ కుమార్ రావ్(Rajkummar Rao) నటించిన లేటెస్ట్ మూవీ శ్రీకాంత్(Srikanth Movie) రియల్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు గడ్డ మీద పుట్టి అంధుడు అయినా ఉన్నత శిఖరాలు అధిరోహించిన శ్రీకాంత్ బొల్ల లైఫ్ స్టోరీగా వచ్చింది…హిందీలో రిలీజ్ అయిన తర్వాత…

మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ లో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి జోరుని అలానే చూపిస్తుంది అనుకున్నా కూడా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది.

మొదటి వీకెండ్ లో ఆల్ మోస్ట్ 12 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో కేవలం 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఓవరాల్ గా వీకెండ్ లో 18 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది, ఇండియా గ్రాస్ 24 కోట్ల దాకా ఉండగా ఓవర్సీస్ లో సినిమా మొత్తం మీద….

2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా 26 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకుంది. మంచి సినిమా, హిట్ టాక్ ఉన్నా కూడా జనాలు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాలేదు. కానీ టాక్ పాజిటివ్ గానే ఉండటంతో రెండో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించవచ్చు అని అంచనా వేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here