బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా అద్బుతమైన ఓపెనింగ్స్ ని అందుకుంది. శుక్రవారం వర్కింగ్ డే నే అయినా కూడా సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సినిమా ఓపెనింగ్ డే రోజున ఏకంగా 11.8 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది…
సినిమా రిలీజ్ కి ముందు రోజు వరకు ఉన్న ప్రీ బుకింగ్స్ మొత్తం మీద 1.2 కోట్ల దాకానే ఉండగా రిలీజ్ రోజున మార్నింగ్ షోల బుకింగ్స్ కూడా చాలా నార్మల్ గానే ఉండటంతో కలెక్షన్స్ 2.5 కోట్ల దాకా ఉండొచ్చు అనుకున్నారు అందరూ కూడా…
కానీ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న విరూపాక్ష సినిమా షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిన సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఊహకందని జోరుని చూపించిన ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా…
ఏకంగా 6.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. రీసెంట్ టైంలో రిలీజ్ అయిన మూవీస్ లో ప్రీ బుకింగ్స్ చాలా వీక్ గా ఉండి, మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఈ రేంజ్ లో ఎక్స్ లెంట్ గ్రోత్ ని దక్కించి సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా విరూపాక్ష ఒక్కటే అని చెప్పాలి.