Home న్యూస్ 2 డేస్ అనుభవించు రాజా కలెక్షన్స్…బానే హోల్డ్ చేశాడుగా!

2 డేస్ అనుభవించు రాజా కలెక్షన్స్…బానే హోల్డ్ చేశాడుగా!

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ అనుభవించు రాజా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి కథ పరంగా రొటీన్ రొట్ట అనిపించుకున్నా కానీ కామెడీ అక్కడక్కడా పర్వాలేదు అనిపించడం అండ్ టీం సినిమాను చాలా బాగా ప్రమోట్ చేయడం తో ఓపెనింగ్స్ మొదటి రోజు అనుకున్న రేంజ్ కన్నా కొంచం బెటర్ గానే సొంతం చేసుకుంది ఈ సినిమా…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 67 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా 73 లక్షల షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేసి ఓవరాల్ గా డీసెంట్ అనిపించుకుంది. సినిమా రెండో రోజు 40 లక్షల రేంజ్ లో…

కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకోగా ఓవరాల్ గా రెండో రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొంచం గ్రోత్ ని చూపెట్టి మొత్తం మీద 45 లక్షల దాకా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 48 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో సినిమా టోటల్ గా 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 43L
👉Ceeded: 23L
👉UA: 13L
👉East: 8L
👉West: 5L
👉Guntur: 8L
👉Krishna: 7L
👉Nellore: 5L
AP-TG Total:- 1.12CR(1.75CR~ Gross)
Ka+ROI: 4L
OS – 4L
Total WW: 1.20CR(1.92CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్…

మొత్తం మీద సినిమాను 3.5 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా 4 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల తర్వాత సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.8 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. మరి సినిమా ఆదివారం రోజున రెట్టించిన జోరు చూపెడితే క్లీన్ హిట్ కి చేరువ అయ్యే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here