Home న్యూస్ 2.0 రివ్యూ…ఎపిక్ విజువల్ వండర్

2.0 రివ్యూ…ఎపిక్ విజువల్ వండర్

1

            బాహుబలి తర్వాత ఇండియా మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూసిన సినిమా రోబో 2.0 ఎట్టకేలకు అనేక అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు ఈ రోజు సుమారు 10 వేల కి పైగా థియేటర్స్ ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరగని రేంజ్ లో రిలీజ్ అయ్యింది. 8 ఏళ్ల క్రితం రోబో సినిమా తో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన శంకర్ రజినీ లు ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భీభత్సాన్ని నమోదు చేశారో తెలుసుకుందాం పదండి.

స్టొరీ లైన్: అనుకోకుండా ఒక వ్యక్తీ చనిపోతాడు. తర్వాత వరుసగా హత్యలు జరుగుతాయి. అవి ఆపే పని వశీకర్ హెల్ప్ తీసుకుంటుండగా సెల్ ఫోన్స్ మాయం అవ్వడం కొంత మంది చనిపోవడం తో తప్పక గవర్నమెంట్ తిరిగి చిట్టి ని తిరిగి ఆన్ చేస్తుంది.

కానీ ఆ చిట్టి అనుకోకుండా విలన్ చేతి తో చనిపోయిన తర్వాత సూపర్ పవర్ 2.0 వస్తుంది తర్వాత సినిమా ఎలా ముందుకు వెళ్ళింది అన్నది అసలు. సినిమాలో ఇంటర్ లింక్ తో చాలా కథలు ఉన్నాయి అవేవి బయటికి చెప్పకుండా డైరెక్టర్ శంకర్ రివీల్ చేసిన కథ పాయింట్ పైది.

థియేటర్స్ లో వచ్చిన ఆడియన్స్ ఊహకందని లెవల్ లో విజువల్ వండర్స్ తో పాటు పకడ్బందీ కథ ని సిద్ధం చేసుకుని ప్రేక్షకులకు మరో కథ ట్రైలర్ లో చూపి థియేటర్స్ కి వచ్చాక అసలు కథ చెప్పి అల్టిమేట్ గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు శంకర్.

పెర్ఫార్మెన్స్: రజినీకాంత్ మూడు రోల్స్ లో కుమ్మేశాడు, 2.0 రోల్ అయితే హీరోయిజం టన్నుల్లో చూపుతూ ఫ్యాన్స్ కే కాదు ఆడియన్స్ కి కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక కామెడి తో కూడా ఆకట్టుకున్నాడు రజినీ. ఇక అక్షయ్ కుమార్ విలనిజం బాగుంది.

సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సెకెండ్ ఆఫ్ హీరో విలన్ ఫైట్ సీన్స్ కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది. ఇక హిరోయిన్ అమీ జాక్సన్ జస్ట్ ఒకే అనిపించుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిది మేరకు నటించి మెప్పించారు.

సంగీతం: రెహమాన్ అందించిన సంగీతం తో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి వెన్నెముక.. యాక్షన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ హాలివుడ్ రేంజ్ ని మరిపిస్తుంది. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో కూడా రెహమాన్ సంగీతం గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది.

సాంకేతిక వర్గం: ఎడిటింగ్ ఇంకొంచం షార్ప్ గా ఉంటె బాగుండేది. సెకెండ్ ఆఫ్ చూశాక ఫస్టాఫ్ మరింత షార్ప్ గా ఉండే బాగుండేది అనిపిస్తుంది, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అన్నీ టాప్ నాట్చ్. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ హాలివుడ్ రేంజ్ ని ఏమాత్రం తీసిపోవు.

విశ్లేషణ: ముందుగా చెప్పినట్లే అసలు కథలు చెప్పకుండా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించి తన స్క్రీన్ ప్లే, అల్టిమేట్ విజువల్స్ తో అల్లల్లాడించాడు శంకర్. ఇండియా లో ఇప్పటి వరకు వచ్చిన 3D మూవీస్ లో ది బెస్ట్ మూవీ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.. 

రజినీ ని చూపెట్టిన విధానం, ఇంటర్వెల్ సీన్, చివరి 30 నిమిషాల ఎపిసోడ్, విలన్ ఫ్యాష్ బ్యాక్ ఇలా ప్రతీ చోటా శంకర్ మార్క్ కనిపించింది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ ని డిసైన్ చేసిన తీరు వాటిని తెరకెక్కించిన విధానం హాలివుడ్ డైరెక్టర్ కి ఏమాత్రం తీసిపోలేదు శంకర్.

ప్లస్ పాయింట్స్: రజినీకాంత్, 2.0 హీరోయిజం, ఇంటర్వెల్, క్లైమాక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్: స్టొరీ కొంచం ప్రిడిక్ట్ చేసేలా ఉండటం
హైలెట్ సీన్: అన్ డౌటేడ్ గా క్లైమాక్స్ ఫైట్ సీన్ అని చెప్పొచ్చు.

టోటల్ గా సినిమా అందరి అంచనాలను మించే హాలివుడ్ రేంజ్ లో ఉన్న ఒక ఇండియన్ సినిమా…ఇద్దరు ఫామ్ లో లేరని డౌట్ పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే ఊహకందని విజువల్స్ తో అందరి మెప్పు పొందటం ఖాయం. ఈ సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 4 స్టార్స్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here