Home న్యూస్ నారప్ప 2 వీక్స్ వ్యూస్ కౌంట్….ఊరమాస్ భీభత్సం ఇది!

నారప్ప 2 వీక్స్ వ్యూస్ కౌంట్….ఊరమాస్ భీభత్సం ఇది!

0

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ తర్వాత కొన్ని కారణాల వలన ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కానీ డిజిటల్ లో రిలీజ్ అయినప్పటికీ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న నారప్ప సినిమా….

మొదటి రోజు మొదటి వారం ఇలా డిజిటల్ లో కూడా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపింది. మొత్తం మీద మొదటి వారానికి గాను ఆల్ మోస్ట్ 30 మిలియన్స్ దాకా ఓవరాల్ వ్యూస్ ని సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలియజేయగా ఇప్పుడు మొత్తం మీద…

సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు కావొస్తు ఉండటం తో ఓవరాల్ గా రెండు వారాల వ్యూవర్ షిప్ లెక్క ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది. మొదటి వారం 30 మిలియన్స్ దాకా వ్యూస్ ని సొంతం చేసుకున్నా రెండో వారం నారప్ప జోరు కొనసాగించిందట..

ఓవరాల్ గా రెండో వారంలో ఆల్ మోస్ట్ 9 మిలియన్స్ వరకు వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. దాంతో ఓవరాల్ గా రెండు వారాల్లో టోటల్ గా ఈ సినిమా 39 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ఇక ఇందులో ఓవరాల్ గా యూనిక్ వ్యూస్ 6 మిలియన్స్ దాకా ఉండే అవకాశం ఉందని చెబుతున్ననారు.

ఇది కూడా అద్బుతం అనే చెప్పాలి. సినిమా కి పెట్టిన రేటు కి ఊహకందని రెస్పాన్స్ ను నారప్ప సినిమా సొంతం చేసుకుంది. సినిమా కి ఒరిజినల్ తో కంపారిజన్ ఓ రేంజ్ లో హెల్ప్ చేసింది అని చెప్పాలి. దాంతో టోటల్ సౌత్ మొత్తం కూడా సినిమా కి వ్యూస్ లభించడం జరిగింది అంటున్నారు. మొత్తం మీద నారప్ప OTT లో సూపర్ సక్సెస్ గా నిలిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here