ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో సొంతం అవ్వగా సినిమా ట్రైలర్ అల్టిమేట్ రీచ్ ని సొంతం చేసుకోవడమే కాదు వ్యూస్ పరంగా లైక్స్ పరంగా…
స్టార్టింగ్ లో సెన్సేషన్ అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుని తర్వాత కొంచం స్లో డౌన్ అయినా లైక్స్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేసి భీభత్సం సృష్టించింది ఈ ట్రైలర్… లైక్స్ పరంగా ప్రీవియస్ రికార్డ్ ను 7 గంటల 43 నిమిషాల్లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా…
వ్యూస్ పరంగా కూడా ఫాస్టెస్ట్ 10 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని పంబ రేపడంతో కచ్చితంగా 24 గంటల్లో కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకున్నారు అందరూ కానీ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ బాహుబలి 2 ట్రైలర్ రికార్డ్ ను మిస్ చేసుకుంది.
అయినా కానీ 20.45 మిలియన్స్ అప్ డేట్ అయిన వ్యూస్ ని సొంతం చేసుకోగా లైక్స్ 1.24 మిలియన్ లైక్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది. వ్యూస్ పరంగా బాహుబలి 2 ట్రైలర్ 21.81 మిలియన్ వ్యూస్ తో ఇప్పటికీ టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ నిలిచింది. ఇక లైక్స్ పరంగా వకీల్ సాబ్ ట్రైలర్ 1.006 మిలియన్ లైక్స్ తో…
ఇప్పుడు టాప్ 2 లో నిలవగా ఆల్ మోస్ట్ 240K రేంజ్ లీడ్ తో లైక్స్ పరంగా టాప్ ప్లేస్ లో నిలిచింది. సౌత్ లో కూడా వ్యూస్ పరంగా బాహుబలి 2 తర్వాత నిలవగా లైక్స్ పరంగా బిగిల్ ట్రైలర్ 1.66 మిలియన్ లైక్స్ తర్వాత రెండో ప్లేస్ లో నిలిచింది ఈ ట్రైలర్…. ఓవరాల్ గా ట్రైలర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ రాగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర జనవరి 7 న ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.
కొంచెం లో మిస్ అయింది సామి🏌️🏌️ లేదంటే అరాచకమే 😜