పాండమిక్ తర్వాత అన్ని ఇండస్ట్రీలు కూడా తేరుకుని సినిమాలను వరుసగా రిలీజ్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సినిమాలతో సక్సెస్ లు అయినా సొంతం చేసుకుంటున్నాయి కానీ ఇండియా లో బిగ్గెస్ట్ సినీ ఇండస్ట్రీ గా పేరున్న బాలీవుడ్ మాత్రం సినిమాలను రిలీజ్ చేయాలి అంటేనే భయపడుతుంది. కొన్ని స్టేట్స్ లో ఇంకా కరోనా ఎఫెక్ట్ తగ్గక పోవడం ముఖ్యంగా మహారాష్ట్ర లో కేసులు ఇంకా పెరగడం లాంటివి బాలీవుడ్ ను భయపడేలా చేస్తుంది.
అయినా కానీ రీసెంట్ గా ధైర్యం చేసిన రూహి అని హర్రర్ కామెడి మూవీ ని రిలీజ్ చేయగా సినిమా కి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చి 20 కోట్ల రేంజ్ కి చేరువగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ ఊపులో బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరున్న జాన్ అబ్రహం…
ఫాం కోల్పోయిన ఇమ్రాన్ హష్మీ ల కాంబినేషన్ లో ముంబై సెగ అంటూ ఓ యాక్షన్ మూవీ ని రూపొందించగా ఈ సినిమాను ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు, ఇండియా మొత్తం మీద 2000 స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడం తో….
కొంచం పేరున్న హీరోలు కాబట్టి సినిమాకి కచ్చితంగా కలెక్షన్స్ బాగా వస్తాయి అన్న నమ్మకంగా ఉన్న బాలీవుడ్ వాళ్లకి ఈ సినిమా టాక్ ఏమంత ఆశించిన మేర రాలేదు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయానికి వస్తే మొదటి రోజు మొత్తం మీద ఈ సినిమా 2.84 కోట్ల కలెక్షన్స్ ని సాధించగా… రెండో రోజు మొత్తం మీద…
2.4 కోట్ల కలెక్షన్స్ ని టోటల్ గా 2 రోజుల్లో ఈ సినిమా 5.22 కోట్ల కలెక్షన్స్ ని మాత్రమె సాధించింది, సినిమా ను 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించారు. 2000 స్క్రీన్స్ లో రిలీజ్ అయినా కానీ ఈ చిల్లర కలెక్షన్స్ చూసి ట్రేడ్ మొత్తం విస్తు పోయారు. బాలీవుడ్ కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందేమో అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.