2019 ఇయర్ చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది. మరో రెండున్నర నెలలు అయితే ఇయర్ ఎండ్ అవుతుంది. కాగా ఈ ఇయర్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు 100 కి పైగానే ఉండగా అందులో విజయం సాధించిన సినిమాలు చాలా తక్కువ, అందులో కూడా సినిమా ను కొన్న బయ్యర్ల కి లాభాలు తెప్పించిన సినిమాలు కూడా చాలా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ కొన్ని సినిమాలు మాత్రం కొన్న బయ్యర్లకి…
అల్టిమేట్ లాభాలు తెపించాయి. ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన ఎఫ్ 2 సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఆల్ టైం హైయెస్ట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటి గా నిలిచి సంచలనం సృష్టించింది. ఇక ఇయర్ సమ్మర్ లో మజిలీ సినిమా కూడా కొన్న బయ్యర్లకి…
మంచి ప్రాఫిట్స్ దక్కేలా చేయగా సెకెండ్ ఆఫ్ స్టార్టింగ్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ సినిమా పవర్ చూపుతూ అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకుంది. మొత్తం మీద ఈ ఇయర్ లో ఇప్పటి వరకు అంటే అక్టోబర్ 18 వరకు రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ లాభాలను కొన్న వాళ్లకి దక్కేలా చేసిన…
టాప్ మూవీస్ విషయానికి వస్తే…
సినిమా పేరు లాభం బిజినెస్
?#F2: 50C (34.5Cr Business)
?#iSmartShankar: 22.78C (17.7cr)
?#Majili: 19.2C (21.14Cr)
?#OhBaby: 8.45C (10Cr)
?#JERSEY: 6.03C (26Cr)
?#118Movie: 5.29C (6.3Cr)
?#Maharshi: 4.58C (100Cr)
?#Chitralahari: 4.24C(12.5Cr)
ఇవి మొత్తం మీద ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు.
ముందుగా చెప్పుకున్నట్లే, ఎఫ్ 2 ఇస్మార్ట్ శంకర్ మరియు మజిలీ సినిమాలు మేజర్ గా ఎక్కువ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటగా మిగిలిన సినిమాలు పర్వాలేదు అనిపించే ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇయర్ ఎండ్ అవ్వడానికి మరో రెండున్నర నెలల టైం ఉంది కాబట్టి వేరే ఏవైనా సినిమాలు ఈ లిస్టులో చేరతాయో లేదో చూడలి.