Home గాసిప్స్ ఉప్పెన, వి ది మూవీ, రెడ్…..సమ్మర్ మూవీస్ రిలీజ్ డేట్స్ ఇవేనా??

ఉప్పెన, వి ది మూవీ, రెడ్…..సమ్మర్ మూవీస్ రిలీజ్ డేట్స్ ఇవేనా??

0

ఈ ఏడాది టాలీవుడ్ కి సాలిడ్ స్టార్ట్ దొరకగా అందరూ సమ్మర్ సెన్సేషనల్ మూవీస్ కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు, కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ తో లాక్ డౌన్ అవ్వడం తో అందరూ ఇళ్ళలోకే పరిమితం అవ్వగా సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్నీ వరుస పెట్టి పోస్ట్ పోన్ లు అవ్వడం తెలిసిందే, లాక్ డౌన్ తర్వాత కూడా వెంటనే థియేటర్స్ కి జనాలు వస్తారో రారో చెప్పలేం.

Top 10 Tollywood Birthday Trend Records

ఆల్ రెడీ మందు షాపులు తెరవడం, మిగిలిన చిన్నా చితకా బిజినెస్ లు మొదలు అవ్వడం లాక్ డౌన్ క్రమంగా ఎత్తివేస్తుండగా జూన్ 1 నుండి థియేటర్స్ కూడా ఓపెన్ చేయాలని చూస్తున్నారు, ఒకవేళ ఓపెన్ అయితే, సీట్ కి సీట్ కి గ్యాప్, కేవలం ఆన్ లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకే ఎంట్రీ..

డైలీ 4 షోలకు బదులు 3 షోలు, షో షో కి గ్యాప్ 45 నిమిషాలు, ఈ గ్యాప్ లో థియేటర్ సాని టైజ్ చేసుకోవాలని రూల్స్ పెట్టబోతున్నారట. ఇలాంటి టైం లో జూన్ లో కొత్త సినిమాలు ఏవి రిలీజ్ చేయకుండా పాత సినిమాలనే రిలీజ్ చేసి జనాలు అలవాటు పడ్డాక జులై నుండి కొత్త సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనలో…

టాలీవుడ్ ఉన్నట్లు తెలుస్తుంది, అన్నీ అనుకున్నట్లు జరిగితే, జులై మొదటి వారం లో ఉప్పెన కానీ వి ది మూవీ కానీ రిలీజ్ అవుతాయట, అందులో ఒకటి 2 వారాల గ్యాప్ ఇచ్చి రిలీజ్ అవ్వగా, 4 వ వారం లో రామ్ రెడ్ మూవీ రిలీజ్ కానుందట, ఆగస్టు లో రవితేజ క్రాక్ మూవీ.. తర్వత ఒక్కొటిగా పెండింగ్ లో ఉన్న సినిమాలు రెండు వారాల గ్యాప్ తో…

రిలీజ్ అవ్వబోతున్నాయని లేటెస్ట్ సమాచారం. అలా చేస్తే… షోలు తక్కువ ఉన్నా 2 వారాల రన్ దొరుకుంది కాబట్టి కలెక్షన్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, జూన్ ఫస్ట్ వీక్ వరకు పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న దాని పై ఆధార పది ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఇది నిజం అవుతుందో కాదో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here