బాక్స్ ఆఫీస్ దగ్గర 2024 సమ్మర్ రీసెంట్ టైంలోనే వీకేస్ట్ సమ్మర్ అన్న విషయం అందరికీ తెలిసిందే…సమ్మర్ లో భారీ ఎత్తున రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేసిన పెద్ద సినిమాలతో పాటు కొంచం బజ్ ఉన్న చిన్న అండ్ మీడియం రేంజ్ మూవీస్ సైతం ఎలక్షన్స్ అండ్ IPL ఫీవర్ వలన థియేటర్స్ లో సినిమాలను రిలీజ్ చేయడం ఆపేశాయి…
జూన్ సెకెండ్ ఆఫ్ నుండే ఇప్పుడు తిరిగి సినిమాల సందడి పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉండగా ఈ టైంలో టాలీవుడ్ తరుపున ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. మార్చ్ ఎండ్ టైంలో టిల్లు స్క్వేర్(Tillu Square Movie) బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత…
ఆల్ మోస్ట్ ఇప్పటి వరకు నెలన్నర అవుతున్నా ఒక్కటంటే ఒక్క టాలీవుడ్ మూవీ కూడా ఆడియన్స్ ను మెప్పించ లేక పోయింది. అన్నీ చిన్నా చితకా సినిమాలే అయినా కూడా కనీసం రెస్పాన్స్ కూడా ఆశించిన మేర సొంతం చేసుకోలేక పోయాయి. ఈ గ్యాప్ లో ఒక్క డబ్బింగ్ మంజుమ్మేల్ బాయ్స్ హిట్ గా నిలిచినా కూడా…
టాలీవుడ్ తరుపున కంప్లీట్ సమ్మర్ మొత్తాన్ని గాలికి వదిలేశారు…. థియేటర్స్ కి రండి సినిమాలు చూడండి అంటూ మేకర్స్ చెబుతున్నా సరైన సినిమా లేక పొతే జనాలు ఎందుకని వస్తారు….ఈ ఇయర్ ఓవరాల్ గా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ టైం వరకు ఒక్క మళయాళ ఇండస్ట్రీ బాగా క్యాష్ చేసుకుని ఎక్స్ లెంట్ సక్సెస్ లను ఎంజాయ్ చేసింది…
ఇతర ఇండస్ట్రీలు అన్నీ కూడా అలా చూస్తూ ఉండిపోయాయి…టాలీవుడ్ లాంటి ఎక్కువ మంది స్టార్స్ అండ్ మీడియం రేంజ్ హీరోలు ఉన్న ఇండస్ట్రీ కంప్లీట్ సమ్మర్ ని వదిలివేసి ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో వరుస సినిమాలతో రాబోతున్నాయి. ఎలక్షన్స్ ఫీవర్ కొన్ని రోజుల్లో అయిపోబోతుంది కాబట్టి సెకెండ్ ఆఫ్ లో అయినా ఆశించిన మేర సక్సెస్ లు టాలీవుడ్ కి సొంతం అవుతాయో లేదో చూడాలి.