మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా రెండు వారాలను దిగ్విజయంగా పూర్తీ చేసుకున్నా ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా ఏమాత్రం జోరు తగ్గలేదు. సినిమా సాయి ధరం తేజ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా లాభాల పరంగా కూడా కెరీర్ లోనే ఇప్పుడు ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసుకుంది…
సినిమా టోటల్ బిజినెస్ 22 కోట్ల రేంజ్ లో ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాలలో ఆల్ మోస్ట్ 42 కోట్ల లోపు షేర్ ని అందుకున్న సినిమా 15వ రోజు కలెక్షన్స్ తో ఓవరాల్ గా బిజినెస్ మీద ఏకంగా 20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
సాయి ధరం తేజ్ కెరీర్ లో ఇది వరకు ప్రతీ రోజూ పండగే సినిమా టోటల్ రన్ లో 17.80 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 16.26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలన విజయాన్ని దక్కించుకోగా ఇప్పుడు ఆ కలెక్షన్స్ ని ఆల్ రెడీ బ్రేక్ చేసిన సినిమా…
లాభాల పరంగా కూడా కొత్త రికార్డ్ ను సాయి ధరం తేజ్ కెరీర్ లో నమోదు చేస్తూ 20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను బిజినెస్ మీద సొంతం చేసుకుని సుప్రీమ్ హీరోకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ని సొంతం అయ్యేలా చేసింది. ఫైనల్ రన్ లో సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.