మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా మొదటి రోజు అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకోగా సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సాయి ధరం తేజ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఓపెనర్ గా నిలిచింది. 8.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా 11.85 కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా…
రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దుమ్ము లేపగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 8 కోట్ల నుండి 8.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల నుండి 10.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
దాంతో ఇప్పుడు టోటల్ గా 2 రోజులకు గాను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోబోతుండగా వరల్డ్ వైడ్ గా 22 కోట్ల మార్క్ ని దాటేయ బోతుందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే….
ఈ కలెక్షన్స్ మార్క్ ని కూడా సినిమా అధిగమించడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా అద్బుతమైన పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.