బాక్స్ అఫీస్ దగ్గర మూడు వారాలను పూర్తీ చేసుకుని నాలుగో వారంలో అడుగు పెట్టిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 4వ వారంలో కూడా జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా 23 వ రోజు తెలుగు రాష్ట్రాలలో మరోసారి మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ ఉండగా ఈ రోజు సినిమా 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను…
తమిళనాడులో 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కేరళలో 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే ఛాన్స్ ఉండగా హిందీ లో మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ తో 4.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా టోటల్ గా ఇండియా లో…
8.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే ఛాన్స్ ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా 9.5 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా అందుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద సినిమా మరోసారి మంచి కలెక్షన్స్ ని అందుకోబోతుంది. ఇక వీకెండ్ లో రచ్చ రచ్చ చేయడం ఖాయమని చెప్పాలి ఇక.