స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అల వైకుంఠ పురంలో సినిమా అఫీషియల్ ట్రైలర్ ని మ్యూజికల్ ఫెస్ట్ లో భాగంగా రిలీజ్ కి గంట ముందు అనౌన్స్ చేసి ట్రైలర్ ని లాంచ్ చేయగా రెస్పాన్స్ మాత్రం అదిరి పోయే విధంగా వచ్చింది. కానీ అదే సమయం లో యూట్యూబ్ లో ట్రైలర్ అనుకున్న రేంజ్ రికార్డ్స్ ని అందుకోలేదు.
ఓవరాల్ గా అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏవి నమోదు కాలేదు కానీ ఉన్నంతలో అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ ని సినిమా ట్రైలర్ సొంతం చేసుకుంది. సినిమా ట్రైలర్ 24 గంటలు ముగిసే సరికి వ్యూస్ పరంగా 6.31 మిలియన్ వ్యూస్ ని అందుకోగా…
లైక్స్ పరంగా 3 లక్షల 26 వేల లైక్స్ ని అందుకుంది. ఒకసారి టాలీవుడ్ లో 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన ట్రైలర్స్ ని గమనిస్తే
?#Baahubali2: 21.81M
?#Saaho: 12.32M
?#Maharshi: 7.31M
?#SarileruNeekevvaruTrailer: 7.26M
?#AravindhaSametha: 7.8M(1Channel: 6.98M)
?#NaaNuvve-6.97M
?#VinayaVidheyaRama: 6.57M
?#AlaVaikunthapurramulooTrailer: 6.31M**
ఇక ఓవరాల్ గా 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సాధించిన ట్రైలర్స్ ని గమనిస్తే
?#Baahubali2: 497k
?#Saaho: 392K
?#SarileruNeekevvaruTrailer: 347K
?#SyeRaaTrailer: 341K
?#AravindhaSametha: 327k
?#AlaVaikunthapurramulooTrailer: 326K**
?#Agnyaathavaasi: 272k
?#VinayaVidheyaRama: 238k
ఇదీ ఓవరాల్ గా అల వైకుంఠ పురంలో సినిమా ట్రైలర్ 24 గంటల షాకింగ్ రెస్పాన్స్..
రికార్డులు సృష్టించడం లో విఫలం అయినా కానీ సడెన్ గా రిలీజ్ చేసినా కానీ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది ఈ ట్రైలర్. ఓవరాల్ గా సినిమా ట్రైలర్ కి రీచ్ బాగానే రాగా క్రేజ్ కూడా పెరిగింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.