Home న్యూస్ 24 గంటలు ఓవర్….భీమా ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!

24 గంటలు ఓవర్….భీమా ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో సతమతం అవుతూ ఉన్న టైంలో తన లేటెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయ్యే అవకాశం ఉందీ అనిపించేలా చేసిన కొత్త సినిమా భీమా(Bhimaa Movie) అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…

కొంచం విరూపాక్ష, ఊరు పేరు భైరవకోనలను పోలి ఫాంటసీ ఎలిమెంట్స్ తో డీసెంట్ గ్రాఫిక్స్ ను మిక్స్ చేసి తెరకెక్కించినట్లు అనిపిస్తున్న భీమా సినిమా ట్రైలర్ పరంగా గోపీచంద్ రీసెంట్ మూవీస్ అన్నింటిలోకీ యూనిక్ గా అనిపించింది….కొంచం సాహసం మూవీ టైప్ లో కొత్త జానర్ ని ట్రై చేస్తున్నాడు గోపీచంద్ ఈ సినిమాతో…

ఇక ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి 24 గంటల్లో ఈ ట్రైలర్ కి ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యిందని చెప్పొచ్చు… ఓవరాల్ గా వ్యూస్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ ట్రైలర్ కి 5.15 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా చూసుకుంటే…

ఈ ట్రైలర్ కి 130.6K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా వెరీ గుడ్ రెస్పాన్స్ ను ఇప్పుడు సొంతం చేసుకుంది భీమా ట్రైలర్. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి కానుకగా మార్చ్ 8న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా తో గోపీచంద్ బాక్స్ అఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here