Home న్యూస్ 24 గంటలు ఓవర్….డబుల్ ఇస్మార్ట్ టీసర్ రిపోర్ట్ ఇదే!!

24 గంటలు ఓవర్….డబుల్ ఇస్మార్ట్ టీసర్ రిపోర్ట్ ఇదే!!

0

5 ఇయర్స్ బాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయన్ని సొంతం చేసుకున్న రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్(ISmart Shankar) సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సెన్సేషనల్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double ISMART Teaser) సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా…

సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచం మిక్సుడ్ గా వచ్చింది. కొత్త టీసర్ లా చూస్తె బాగానే ఉంది అని చెబుతూ ఉన్నా కూడా మొదటి పార్ట్ టీసర్ ఇచ్చిన కిక్ ని సీక్వెల్ టీసర్ పూర్తిగా మ్యాచ్ చేయలేదు అని అంటున్నారు. అయినా కూడా ఓవరాల్ గా ఈ టీసర్ కి…

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి….ఇక 24 గంటలు పూర్తి అయ్యే టైంకి డబుల్ ఇస్మార్ట్ టీసర్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో పెద్దగా రికార్డులను ఏమి క్రియేట్ చేయలేక పోయింది కానీ ఉన్నంతలో 24 గంటల్లో వ్యూస్ పరంగా 7.04 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోగా…

లైక్స్ పరంగా ఈ టీసర్ 24 గంటల్లో 212.7K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా వెరీ గుడ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది అని చెప్పాలి…కానీ సీక్వెల్ హైప్ దృశ్యా ఇంకా కొత్త రికార్డులను నమోదు చేస్తుందని అందరూ అంచనా వేశారు. ఓవరాల్ గా డబుల్ ఇస్మార్ట్ టీసర్ సినిమా మీద మంచి బజ్ నే క్రియేట్ చేయగా….

ట్రైలర్ కొంచం పర్వాలేదు బాగుంది అనిపించినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సాలిడ్ ఓపెనింగ్స్ ను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక రామ్ కి పూరీ జగన్నాథ్ కి ఈ సినిమా ఎలాంటి కంబ్యాక్ ను ఇస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here