రాజ్ తరుణ్ మాళవికా నాయర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా… సమ్మర్ రేసు లో థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యి డైరెక్ట్ రిలీజ్ ను అక్టోబర్ 1 న సొంతం చేసుకోగా… సినిమా కి రివ్యూ లు నెగటివ్ గా వచ్చాయి కానీ జనాలు మాత్రం సినిమా ను అద్బుతంగా ఆదరించారు ఇప్పటి వరకు… దాంతో సినిమా ఇప్పుడు….
డిజిటల్ హిట్ అవ్వడానికి అడుగు దూరం లో ఉందని అంచనా వేయవచ్చు…. సినిమా ను ఆహా వీడియో వాళ్ళు 4 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా కి మొదటి 3 రోజుల వీకెండ్ లో 3 లక్షల దాకా యూనిక్ వ్యూస్ దక్కాయని అనౌన్స్ చేయగా…
మొదటి వారం తర్వాత 5 లక్షల 50 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందని చెప్పారు. ఇక 10 రోజుల్లో సినిమా 6 లక్షల 35 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోగా… తర్వాత వ్యూస్ అప్ డేట్ రాలేదు… ఇప్పుడు 25 రోజులకు గాను సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ లెక్కల ప్రకారం సినిమా కి మిగిలిన రోజుల్లో ఇప్పటి వరకు 85 వేల దాకా వ్యూస్ దక్కాయట… అంటే మొదటి వారం 10 రోజుల తర్వాత సినిమా చాలా స్లో అయ్యింది, కానీ మొత్తం మీద 25 రోజులకు గాను సినిమా 7 లక్షల 30 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇక కలెక్షన్స్ ఎంత వచ్చాయి అన్నది ఒక్క నెల రేటు తో మల్టి ప్లై చేస్తే…
7 లక్షల 30 వేల యూనిక్ వ్యూస్ కి ఒక టికెట్ 50 అనుకుంటే… 3.65 కోట్ల దాకా రెవెన్యూ దక్కి ఉండొచ్చని అంచనా వేయవచ్చు. సినిమా కి మరో 40 లక్షల రేంజ్ లో రెవెన్యూ జనరేట్ చేస్తే డిజిటల్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. లాంగ్ రన్ లో ఈ మార్క్ ని సినిమా అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదనే చెప్పాలి…