Home న్యూస్ వి మూవీ 100….ఒరేయ్ బుజ్జిగా 100…ఇదేమి మాస్ రా బాబు!

వి మూవీ 100….ఒరేయ్ బుజ్జిగా 100…ఇదేమి మాస్ రా బాబు!

0

టాలీవుడ్ లో ఇది వరకు ఎప్పుడూ జరగనిది ఇప్పుడు జరగడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా ముందుగా సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతాయి తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యాక చివరగా డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ అవుతాయి, కొన్ని సినిమాలు డిజిటల్ రిలీజ్ తర్వాత ఛానెల్ వీలు ని బట్టి టెలికాస్ట్ అవుతాయి. ఇక లేటెస్ట్ గా ఈ టోటల్ విధానం రివర్స్ లో వెళుతూ ఉండగా…. ఇప్పుడు ముందుగా…

డిజిటల్ గా మొదట రిలీజ్ అయిన సినిమాలు తర్వాత టెలివిజన్ రిలీజ్ ను కూడా సొంతం చేసుకుని ఇప్పుడు చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ఆ సినిమాలే నాని సుదీర్ బాబు ల వి ది మూవీ మరియు రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాలు.

ఈ రెండు సినిమాలు ఇప్పుడు డిజిటల్ రిలీజ్, టెలివిజన్ ప్రీమియర్స్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సంక్రాంతి సినిమాలు రావడానికి ఉన్న చిన్న గ్యాప్ లో థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా రెండు సినిమాలు కూడా జనవరి 1 న…

న్యూ ఇయర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాడానికి సిద్ధం అవుతున్నాయి. ఇక మరో విశేషం ఏంటి అంటే సినిమాలు రెండూ కూడా నైజాం లో సాలిడ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్నాయి. ప్రస్తుతానికి వి మూవీ 45 థియేటర్స్ ని ఒరేయ్ బుజ్జిగా 50 థియేటర్స్ ని నైజాం లో కన్ఫాం చేసుకోగా రిలీజ్ రోజు నాటికి రెండు సినిమాలు కూడా ఇప్పుడు చెరో 100 థియేటర్స్ లో…

మినిమమ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్నాయి అని లేటెస్ట్ టాక్. ఒక్క నైజాంలోనే చెరో వంద అంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మరింత సాలిడ్ రిలీజ్ ను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి రెండు సినిమాలు కంప్లీట్ గా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ని బాక్స్ ఆఫీస్ బరిలో చూపుతాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here