Home న్యూస్ డంకి ఫస్ట్ వీక్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ తో బానే వచ్చాయిగా!!

డంకి ఫస్ట్ వీక్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ తో బానే వచ్చాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకి(Dunki Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి హైప్ కి తగ్గ టాక్ ను అయితే సొంతం చేసుకోలేదు, రాజ్ కుమార్ హిరాణి షారుఖ్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా రికార్డుల ఊచకోత కోస్తుంది అని అందరూ అనుకున్నా…

సినిమాకి హైప్ కి ఏమాత్రం న్యాయం చేయలేని టాక్ ను సొంతం చేసుకోగా ఉన్నంతలో క్రిస్టమస్ వీకెండ్ అండ్ న్యూ ఇయర్ వీకెండ్ అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధిస్తూ మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. సినిమా 7వ రోజున ఇండియాలో మొత్తం మీద…

10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా టోటల్ గా మొదటి వారంలో సినిమా 152 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా టోటల్ ఇండియా గ్రాస్ 182 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 122 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకోగా…

టోటల్ గా సినిమా మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా 304 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుంది, సినిమాకి మొత్తం మీద మిక్సుడ్ టాక్ రావడంతో వీక్ ఎండ్ అయ్యే టైంకి ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని సాధించిన సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here