సినిమా అనేది ఒక బిజినెస్….ఎవరితో బెటర్ గా సినిమా బిజినెస్ జరుగుతుందో నాలుగు డబ్బులు వెనక్కి వస్తాయో నిర్మాత అలాంటి వాళ్ళతోనే సినిమాలు నిర్మించాలి అనుకుంటారు. కొందరు హీరోలు కూడా వీళ్ళతో చేస్తే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని, లేదా సినిమాను బాగా ప్రమోట్ చేస్తారని నమ్మి చేస్తారు….
అలాగే లేటెస్ట్ గా తెలుగు లో ఒక హీరో రీసెంట్ టైంలో ఒక హిట్ రెండు ఫ్లాఫ్స్, ఒక హిట్ రెండు ఫ్లాఫ్స్ ఇలా కెరీర్ ను కొనసాగిస్తూ ఉండగా సినిమా సినిమాకి తన రెమ్యునరేషన్ ని మాత్రం పెంచుతూనే ఉండగా థియేటర్స్ నుండి షేర్ కూడా ఆ రేంజ్ లో కొన్ని సినిమాలకు రాని పరిస్థితి ఉంది…
ఇలాంటి టైంలో తనకి భారీ హిట్ ఇచ్చిన ఓ డైరెక్టర్ తో ఏకంగా ఇప్పుడు 110 కోట్ల రేంజ్ బడ్జెట్ లో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసిన మేకర్స్ కి ఆ హీరో రెమ్యునరేషన్ విషయంలో 26 కోట్లకు ఏమాత్రం తగ్గకపోవడంతో చేసేదేమీ లేక వేరే ఆప్షన్స్ వెతుకుతూ ఉన్న టైంలో…
సడెన్ గా బాలీవుడ్ లో ఓ సీనియర్ హీరో దొరికాడట….ఆ హీరో కి చాలా టైంగా హిట్ లేదు, అయిన ఓ భారీ కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు… దాంతో భారీగా పడిపోయిన మార్కెట్ ఒక్కసారిగా పట్టాలు ఎక్కింది. దాంతో ఆ హీరోతో 42 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తో సినిమాను కమిట్ అయినట్లు తెలుస్తుంది..
మన హీరో అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ బాగానే వస్తున్నా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అన్నీ లెక్కలు వేసుకున్నా టేబుల్ ప్రాఫిట్స్ వస్తాయేమో, అదే బాలీవుడ్ హీరో అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ ఎలాగూ భారీ రేటు సొంతం చేసుకుంటాయి. థియేటర్స్ లో కూడా వర్కౌట్ అయితే వచ్చే కలెక్షన్స్ రేంజ్ ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే… అందుకే మేకర్స్ కూడా బాలీవుడ్ హీరోకే ఓటు వేశారు… మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.