బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని రేంజ్ లో ఊచకోత కోస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా ఇప్పుడు నాలుగు వారాలను పూర్తి చేసుకునే పనిలో ఉండగా 27వ రోజున సండే అడ్వాంటేజ్ తో అనుకున్న అంచనాలను మించి…
జోరు చూపించిన సినిమా 28వ రోజున ఫుల్ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంది కానీ సినిమా ఇప్పటికే చేయాల్సిన రచ్చ కి మించి మాస్ రచ్చ చేసింది అని చెప్పాలి. ఓవరాల్ గా 27వ రోజుతో పోల్చితే సినిమా ఆల్ మోస్ట్…
65-70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో. ఆఫ్ లైన్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసే అవకాశం ఉండటంతో మొత్తం మీద 28వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 25-30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది, ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 35 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…. ఓవరాల్ గా సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను…
ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి ఎట్టకేలకు ఇప్పుడు అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటున్నా కూడా ఆల్ రెడీ ఎపిక్ రికార్డులతో దుమ్ము లేపిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా టోటల్ గా 4 వారాల ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.