బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సూపర్బ్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ నాలుగు వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా, ఇప్పటికీ డీసెంట్ ట్రెండ్ నే బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ…
లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 29వ రోజున మరోసారి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా వీకెండ్ తర్వాత కొంచం ఎక్కువగా డ్రాప్ అయినట్లు అనిపించినా కూడా ఉన్నంతలో మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తుంది సినిమా..
28వ రోజుతో పోల్చితే 29వ రోజున లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 20 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు.
ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో సినిమా లిమిటెడ్ థియేటర్స్ లోనే రన్ అవుతూ ఉండగా షేర్స్ కూడా లిమిటెడ్ గానే వచ్చే అవకాశం ఉండగా ఓవరాల్ గా 29వ రోజున సినిమా వరల్డ్ వైడ్ గా 24 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 29 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.