బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా(Matka Movie 2 Days Collections) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా వరుణ్ తేజ్ కెరీర్ లో మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్నా కూడా మొదటి రోజే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది.
మొదటి రోజు చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని కూడా సొంతం చేసుకున్న సినిమా అవన్నీ తీయకుండా 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీసేస్తే…
సగం వరకు షేర్ తగ్గే అవకాశం ఉండగా రెండో రోజు సినిమా ఆల్ మోస్ట్ 65% కి పైగా డ్రాప్స్ ను ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ లో కూడా సినిమా టికెట్ సేల్స్ ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయాయి. ఒక్క వైజాజ్ ఏరియాలో కొంచం పర్వాలేదు…
అనిపించిన సినిమా మిగిలిన చోట్ల ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. ఓవరాల్ గా రెండో రోజు డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా ఓవరాల్ గా 20 లక్షల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీసేస్తే షేర్ ఏమి ఉండదనే చెప్పాలి…
వరల్డ్ వైడ్ గా కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో అటూ ఇటూ గా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా 1.1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకోగా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీసేస్తే 60 లక్షల రేంజ్ లో షేర్ ఉండే అవకాశం ఉంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 18.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఆ లెక్కన చూసుకుంటే మైండ్ బ్లాంక్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మిగిలిన 2 రోజుల వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇక…