Home న్యూస్ 165+ కోట్ల ఊచకోత…ఫస్ట్ డే KGF2 కలెక్షన్స్ రిపోర్ట్!!

165+ కోట్ల ఊచకోత…ఫస్ట్ డే KGF2 కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కన్నడ సినిమా చరిత్ర లో ఏ సినిమా కూడా సాధించని చారిత్రిక ఓపెనింగ్స్ తో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సంచలన ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతుంది అని చెప్పాలి. ముందుగా తెలుగు రాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే సినిమా 20 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉండగా డబ్బింగ్ మూవీస్ లో ఇది ఓ చరిత్ర అని చెప్పాలి…..

ఇక హిందీ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపబోతున్న ఈ సినిమా 58 కోట్ల నుండి 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉండగా సినిమా బాలీవుడ్ ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ చేసే ఓపెనింగ్స్ ని అందుకోనుంది…

ఇక సినిమా కర్ణాటక లో స్క్రీన్ కౌంట్ తక్కువ అయినా టికెట్ రేట్స్ ఎక్కువ అవ్వడం ఆక్యుపెన్సీ నెక్స్ట్ లెవల్ లో ఉండటంతో 30-32 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, తమిళనాడు లో మొదటి రోజు ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తున్న సినిమా అక్కడ 12-14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునేలా ఉంది….

ఇక కేరళలో సినిమా మొదటి రోజు 7 కోట్ల నుండి 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మొత్తం మీద ఇండియా లో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 140 కోట్ల నుండి 145 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ తో మొత్తం మీద మొదటి రోజు టోటల్…

వరల్డ్ వైడ్ గా 165 కోట్లు అధిగమించడం ఖాయం కాగా ఫైనల్ లెక్కలు 170 కోట్ల కి పైగా ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ రేంజ్ ఓపెనింగ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అందుకోబోతున్న కేజిఎఫ్ 2 సినిమా ఫైనల్ ఫస్ట్ డే కలెక్షన్స్ టోటల్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్యర్యపరిచే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here