బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు విజయ్ దేవరకొండ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.
ఇక సినిమా రెండో రోజులో అడుగు పెట్టగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ నే చూపించగా నైజాంలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలలో మాత్రం పెద్దగా గ్రోత్ ని చూపించడం లేదు… ఉన్నంతలో జస్ట్ ఓకే అనిపించేలా..
హోల్డ్ చేస్తున్న సినిమాకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా కొంచం ఇంపాక్ట్ చూపించింది. మొత్తం మీద మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ తర్వాత ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే….
5.5 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది. అన్ని క్రికెట్ మ్యాచ్ ఎఫెక్ట్ అండ్ మాస్ సెంటర్స్ లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకొంచం షేర్ పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా రెండో రోజు వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 8కోట్ల నుండి 8.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఇది మంచి హోల్డ్ అనే చెప్పాలి పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే. మరి సినిమా ఈ అంచనాలను అందుకుంటుందా లేక అంచనాలను మించిపోయి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…