Home న్యూస్ ప్రతీరోజూ పండగే డే 2 ఓపెనింగ్స్….కుమ్ముతున్నాడుగా!!

ప్రతీరోజూ పండగే డే 2 ఓపెనింగ్స్….కుమ్ముతున్నాడుగా!!

0

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళని సాధించింది, రెండు తెలుగు రాష్ట్రాలలో 3.23 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 4.33 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసింది.

ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి జోరు ని చూపుతూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 40% లోపు వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్…

జోరు అందుకున్న నేపధ్యంలో మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు సుప్రీం హీరో కుమ్మే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా రెండో రోజు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ దృశ్యా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ని బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్క 2 కోట్ల నుండి ఆ పైన వెళ్ళే చాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టార్గెట్ 18.5 కోట్లు అవ్వగా ఫస్ట్ డే నే 4.3 కోట్లకు పైగా రికవరీ అవ్వడంతో…

సినిమా రెండో రోజు సాధించే కలెక్షన్స్ సాలిడ్ గా ఉన్నాయనే చెప్పాలి, అది కూడా పోటి లో సినిమా మంచి వసూళ్ళని అందుకుంటూ ఉండటం తో వీకెండ్ కూడా సాలిడ్ గా ఉండే చాన్స్ ఉంది, ఇక రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here